Header Banner

ఏపీ నుండి నేరుగా విదేశాలకు విమానాలు! సీఎం చంద్రబాబు చొరవతో!

  Thu Jun 12, 2025 14:18        Politics

విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. విజయవాడ, విశాఖ సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వర్చువల్‌గా హాజరయ్యారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవన నిర్మాణం, డిజైన్లు అత్యంత ఆకర్షణీయంగా, విభిన్నంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. టెర్మినల్ బిల్డింగ్, జాతీయ రహదారిని అనుసంధానించేలా ర్యాంప్ నిర్మాణం తదితర అంశాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. టెర్మినల్ భవనం ఎలివేషన్, డిపార్చర్, అరైవల్ బ్లాక్​లు, ప్రయాణికుల లాంజ్‌లు ఇలా వేర్వేరు ప్రాంతాల్లో రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా డిజైన్లు ఉండాలని స్పష్టం చేశారు. సంప్రదాయ నృత్యకళ కూచిపూడి, కొండపల్లి బొమ్మలు, అమరావతి చిహ్నాలు, లేపాక్షి కళాకృతులతో డిజైన్లు రూపొందించాల్సిందిగా సీఎం చెప్పారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!

 

రాష్ట్రంలో కడప, రాజమహేంద్రవరం టెర్మినల్ భవన నిర్మాణాలకు సంబంధించిన పురోగతిని సీఎంకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం జిల్లా పలాస విమానాశ్రయాల టెక్నికల్ ఫీజిబిలిటి రిపోర్టుపై పని చేస్తున్నామని తెలిపారు. అమరావతిలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి భూ పరిశీలన జరుగుతోందని దీనికి సంబంధించి రైట్స్ బృందం త్వరలో నివేదిక ఇస్తుందని సీఎంకు వివరించారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తే రెండేళ్లలో ప్రాజెక్టును చేపడతామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇంకా విజయవాడ, విశాఖ విమానాశ్రయాల నుంచి 40 శాతం మేర ఆపరేషన్స్ పెరిగాయని వివరించారు.  విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు విమానాశ్రయాల నుంచి దేశీయంగా వివిధ నగరాలకు కనెక్టివిటి పెంచేందుకు ఆపరేటర్లు ముందుకు వస్తున్నారని కేంద్రమంత్రి సీఎంకు తెలిపారు. ట్రూజెట్ సంస్థ విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు అక్టోబరు నుంచి సర్వీసులు నడిపేందుకు ముందుకు వచ్చిందని అన్నారు. విజయవాడ - సింగపూర్, తిరుపతి - మస్కట్​ల మధ్య కూడా త్వరలోనే ఫ్లైట్ సర్వీసు కూడా మొదలు కానున్నట్టు వివరించారు. సెప్టెంబరు తర్వాత సీ ప్లేన్ ఆపరేషన్స్ కూడా ప్రారంభమవుతాయన్నారు. ఖతార్ ఏవియేషన్ ఫండ్ భోగాపురం విమానాశ్రయం వద్ద పెట్టుబడులకు ఆసక్తి కనపరుస్తోందని కేంద్రమంత్రి సీఎంకు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

శుభవార్త: రూ.6,405 కోట్ల విలువైన 2 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం! ఏపీ సహా 3 రాష్ట్రాలకు చాలా మేలు!

 

నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!

 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం

 

12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..

 

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #International AirPorts #Review #ViralNews